గోల్డెన్ హార్ట్ రోహిత్..ది బెస్ట్ పర్ఫామర్ ఆఫ్ ది సీజన్!
on Dec 2, 2022
రోహిత్ ఓడిపోయినా కూడా తను బిహేవ్ చేసిన విధానం తనని గెలిపించింది అంతే.. అంటే ఇక్కడ టాస్క్ ఓడిపోవచ్చు కానీ ప్రేక్షకుల మనసు గెలిచాడు. ప్రతీ దగ్గర జెంటిల్ మెన్ నేచర్, గుడ్ బిహేవియర్. కచ్చితంగా అతడి స్థాయిని పెంచుతాయి. ఇప్పటివరకు జరిగిన సీజన్ లో ఏ కంటెస్టెంట్ కూడా అంత క్లీన్ ఫెయిర్ గేమ్ ఆడలేదు. ప్రతీ టాస్క్ లోను బిగ్ బాస్ రూల్స్ ఫాలో అవుతూ.. ఎక్కడా ఫేవరెటిజం చూపించకుండా, తన గేమ్ తను ఆడుతూ గోల్డెన్ హార్ట్ రోహిత్ అని అనిపించుకుంటున్నాడు.
సోషల్ మీడియాలో రోహిత్ ని 'జెంటిల్ మెన్ రోహిత్' అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు ప్రేక్షకులు. అయితే నిన్న జరిగిన రోల్ బేబీ రోల్ గేమ్ లో శ్రీహాన్ కి ఫేవరెటిజం చేసింది శ్రీసత్య. ఇనయాని మానిపులేట్ చేసి రోహిత్ ని లెవెల్ నుండి బయటకొచ్చేలా ఇనయాతో మార్చి చెప్పించింది శ్రీసత్య. వరెస్ట్ సంచాలక్ గా శ్రీసత్యని ప్రేక్షకులు తిడుతూ కామెంట్స్ చేయగా, ప్యూర్ అండ్ జెంటిల్ మెన్ రోహిత్ అంటున్నారు.
ఓటింగ్ లో నిన్న మొన్నటి దాకా అడుగున ఉన్న రోహిత్.. తన బెస్ట్ పర్ఫామెన్స్ తో టాప్ త్రీ కి చేరుకున్నాడు. కాగా శ్రీసత్య, ఫైమా డేంజర్ జోన్ లో ఉన్నారు.
Also Read